
టిటిడి కాల్ సెంటర్‌ను తనిఖీ చేసిన ఈవో డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి
టిటిడి కాల్ సెంటర్లో అత్యాధునిక సాంకెేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా, సమగ్ర సమాచారం అందించాలని ఈవో డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి కాల్ సెంటర్ సిబ్బందిని ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలో గల కాల్ సెంటర్ పనితీరును అధికారులతో కలిసి ఈవో మంగళవారం తనిఖీ చేశారు.