
కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 13 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. కోవిడ్ -19 నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, మేదినిపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.