
శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్, ఈవో
శ్రీ కాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.
శ్రీ కాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 13 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. కోవిడ్ -19 నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, మేదినిపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. వాహనసేవ ఆస్థానం తరువాత స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు శుక్రవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించాడు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన గురువారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ కల్యాణ శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుని అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.
వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు బుధవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు కోదండరామస్వామివారి అవతారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది.
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష(నాగ)వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
Copyright © 2022 | WordPress Theme by MH Themes