
టిటిడి కాల్ సెంటర్లో అత్యాధునిక సాంకెేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా, సమగ్ర సమాచారం అందించాలని ఈవో డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి కాల్ సెంటర్ సిబ్బందిని ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలో గల కాల్ సెంటర్ పనితీరును అధికారులతో కలిసి ఈవో మంగళవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఈవో నిత్యం భక్తుల నుండి కాల్ సెంటర్‌కు వచ్చే పలు సూచనలు, ఫిర్యాదులను అక్కడి సిబ్బంది ఏ విధంగా రికార్డు చేస్తున్నారు, ఏ విధంగా సమాధానం ఇస్తున్నారో పరిశీలించారు.
కాల్ సెంటర్ పనితీరును, భక్తుల సౌకర్యార్థం టిటిడి చేపడుతున్న కార్యక్రమాల సమాచారం, భక్తుల నుండి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత విభాగాల అధికారులకు ఏవిధంగా తెలియజేస్తున్నారనేది ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి వివరించారు. అనంతరం ఈవో కాల్ సెంటర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి శ్రీ సందీప్ రెడ్డి, ఐటి మేనేజర్ శ్రీ నాదముని, కాల్ సెంటర్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply