
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డిలు దగ్గరుండ దర్శనం ఏర్పాటు చేశారు.
గురువారం తిరుమల చేరుకున్న ఆమెకు టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికి విడిది ఏర్పాటు చేశారు. ఆమె అదే రోజు అన్నదానం కాంప్లెక్స్ లో కూరగాయలు నిల్వ ఉంచే కోల్డ్ స్టోరేజ్, వంటశాల, భోజనశాలను పరిశీలించారు.
ఆ తరువాత మహిళా శ్రీవారి సేవ భవనానికి వెళ్లారు. శ్రీవారి సేవకుల నమోదు విధానం, వసతి, ఇతర సౌకర్యాలు, సేవలందించే విభాగాల గురించి అదనపు ఈఓ వివరించారు.
శుక్రవారం ఉదయం విఐపి విరామసమయంలో ఆలయ ప్రవేశం చేసిన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి, అదనపుఈశో ఏవి ధర్మారెడ్డిలు ఆమెకు తీర్థప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.
Leave a Reply