రెండు నెలల్లో గోమందిరం నిర్మాణం : వైవి సుబ్బారెడ్డి

అలిపిరి పాదాల మండపం సమీపంలో టీటీడీ నిర్మిస్తున్న గోమందిరం, గో తులాభారం భవనాల నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

మంగళవారం ఆయన ధర్మకర్తల మండలి సభ్యులు శేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి తో కలసి గోమందిరం, గోతులాభారం భవనాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొందరు ధర్మకర్తల మండలి సభ్యులు, దాతలు ముందుకు వచ్చి టీటీడీ ఆధ్వర్యంలో ఈ భవనాలు నిర్మిస్తున్నారని చెప్పారు.

కరోనా వల్ల మూడు నెలలు ఈ పనులు ఆగిపోయాయని, మరో రెండు నెలల్లో పూర్తి చేసేలా పని చేస్తున్నట్లు అధికారులు చెప్పారన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు మొదట గోవు పూజచేసుకుని వెళ్లేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

అలాగే గోవు బరువును బట్టి దానికి దాణా లేదా మేత విరాళంగా ఇచ్చే భక్తుల కోసం గోతులాభారం భవనం కడుతున్నట్లు తెలిపారు. భక్తుల కోసం 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

టీటీడీ ఎస్ ఈ రమేష్ రెడ్డి, డెయిరీఫామ్ డైరెక్టర్ హరినాథ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*