
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు నాదనీరాజనం వేదికపై “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం విదితమే.
ఇందులో సంస్కృత శ్లోకాలకు తెలుగులో మంత్ర వివరణ చెబుతారు.
అయితే, తమిళ, కన్నడ భక్తులకు అర్థమయ్యేందుకు వీలుగా సంస్కృత శ్లోకాలకు ఆయా భాషల్లో మంత్ర వివరణతో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు , మల్లీ రాత్రి 10.30 నుంచి 11.30 గంటల వరకు ఎస్వీబీసీ తమిళ, కన్నడ ఛానళ్లలో పునఃప్రసారం చేస్తున్నారు.
ప్రముఖ పండితులు ఆచార్య చక్రవర్తి రాఘవన్ తమిళంలో, డా.కెఎల్.పవన్ కుమార్ కన్నడంలో వ్యాఖ్యానం చేస్తున్నారు.
Leave a Reply