
తిరుమల వసంతోత్సవాల్లో సోమవారం ఉదయం 8.30 నుండి 9.00 గంటల మధ్య ధ్వజస్తంభం వద్ద సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆశీనులైనారు.
సాధారణంగా వసంతోత్సవాల్లో రెండో రోజు స్వర్ణరథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ, కరోనా వ్యాధి నివారణ చర్యలలో భాగంగా టిటిడి రద్దు చేసింది.
అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయంలోని కల్యాణ మండపానికి వేంచేపుచేశారు.
అక్కడ అర్చకులు వసంతోత్సవ అభిషేకాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కాగా మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
పౌర్ణమి గరుడుసేవ రద్దు –
ఈ నెల 7వ తేది మంగళవారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకొని టిటిడి రద్దు చేసింది.
తుంబురు తీర్థ ముక్కోటి రద్దు –
తిరుమలలో ఏప్రిల్ 7వ తేది మంగళవారం నిర్వహించవలసిన శ్రీ తుంబురు తీర్థ ముక్కోటిని కరోనా వ్యాధి నివారణ చర్యలలో భాగంగా టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
Leave a Reply