
గుత్తి పట్టణ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
అనంతపురం జిల్లా గుత్తి పట్టణం లోని కోట ప్రాంతం లో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం ఉదయం సూర్య కిరణాలు స్వామిని తాకాయి.
ప్రతిసంవత్సరం ఫాల్గుణమాసంలో ఉదయం ఈ సూర్య కిరణాలు స్వామి పాదాలను తాకుతాయి. అనంతరం స్వామి పైభాగం వరకు తాకుతాయి.
అరసవెల్లి లో సూర్యనారాయణ స్వామి కి తాకిన 7వరోజు ఇలా కిరణాలు స్వామి ని స్పృశిస్తాయని పండితులు చెబుతారు.
ప్రతి సంవత్సరం లో ఒక రోజు స్వామి వారిని కిరణాలు తాకేలా అలనాటి “స్థపతులు “ఆలయాన్ని నిర్మాణానికి తమ ప్రతిభ నుచాటేలా నిర్మాణ ప్రక్రియ నిర్ణయం ప్రాచ్యాత్య, ఖగోళ శాస్త్రానికి అనుగుణంగా నిర్మించడం, హిందూ ధర్మానికి నేటికీ ఒక మచ్చుతునక.
Leave a Reply