
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మార్చి 17వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 12.00 గంటల నుండి టైంస్లాట్ టోకెన్లు జారీ చేయడం ద్వారా భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.
తిరుమలలో భక్తుల రద్ధీని దృష్ఠిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 మరియు 2లలో వేచి ఉండకుండా టైంస్లాట్ టోకెన్లు పొందిన భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
భక్తుల సౌకర్యార్థం తిరుమల మరియు తిరుపతిలలో టైమ్ స్లాట్లు టోకెన్లు ఇవ్వడానికి కౌంటర్లు ఏర్పాటు చేశారు. టైంస్లాట్ టోకెన్లు తీసుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ , ఒటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా పాస్‌పోర్టు వంటి ఏదేని గుర్తింపు కార్డున్ని తీసుకురావాలి.
భక్తులు తమకు కేటాయించిన సమాయానికి దర్శనానికి వచ్చి టిటిడికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది.
తిరుమలలో టోకెన్ల జారీ కేంద్రాలు :
సిఆర్వో వద్ద – 7 కౌంటర్లు, ఆర్టిసి బస్టాండులో – 7 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాలు :
విష్ణునివాసం, శ్రీనివాసం, రైల్వేస్టేషన్ వెనుకవైపు గల గోవిందరాజస్వామి 2 మరియు 3 సత్రాలు, ఆర్టిసి బస్టాండ్, అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు జారీ చేస్తారు.
అదేవిధంగా అలిపిరి నడక మార్గంలోని నామాల గాలి గోపురం వద్ద, శ్రీవారి మెట్టు నడక దారిలో భక్తులు టోకెన్లు పొందవచ్చు.
Leave a Reply