తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం

వైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన అనంతళ్వారు 966వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్‌ తోటలో (పురశైవారితోట) ఆదివారంనాడు టిటిడి అత్యంత ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్బంగా సుమారు 300లకు పైగా అనంతళ్వారు వంశీకులు ”నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం” నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుమల పెద్దజీయర్‌స్వామిస్వామి అనుగ్రహబాషణం చేస్తు తన 102 ఏళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి పుష్పకైంకర్యాన్ని ప్రారంభించి ఉద్దరించిన వైష్ణవ భక్తాగ్రేసరుడు అనంతాళ్వార్‌ని కొనియాడారు.

అనంతాళ్వారు వంశీకులు గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహం అన్నారు.

అనంతరం తిరుమల చిన్నజీయర్‌స్వామి, కాంచిపురం మనవాల జీర్‌ వడికేశరి అల‌గియ‌స్వామి ఆనంతాళ్వార్‌ జీవిత వైశిష్ట్యం గురించి అనుగ్రహబాషణం చేశారు.

ఈ కార్యక్రమానికి లిఫ్రో గ్రూప్ అఫ్ ప‌బ్లికేష‌న్స్ ఛైర్మ‌న్ టిఎన్ఎల్ విజ‌య‌సార‌ధి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఆయన మాట్లాడుతూ 966 సంవత్సరాల క్రిందట రామానుజాచార్యులవారు స్వామి కైంకర్యాన్ని క్రమబద్దీకరించడానికి తన శిష్యుబృందంలో ఎవరైన ఉన్నారా అడిగారు.

అప్పుడు అనంతళ్వారు మందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

ఆయన తిరుమలలో వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో కూడిన పుష్పాల తోటను ఏర్పరచి స్వామివారి పుష్పకైకర్యాన్ని ఉద్దరించి తన జీవితాన్ని భగవంతుని పాదాలవద్ద పుష్పంగా సమర్పించుకున్నారని వివరించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*