వేద ప‌రిర‌క్ష‌ణ‌, ప్ర‌చారానికి టిటిడి కృషి : టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

వేదాలు సాక్షాత్తు భ‌గ‌వంతుని స్వ‌రూపాల‌ని, స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా వేద ప‌రిర‌క్ష‌ణ‌, ప్ర‌చారానికి టిటిడి విశేష కృషి చేస్తోంద‌ని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలియ‌జేశారు.

తిరుమ‌లలోని ధ‌ర్మ‌గిరిలో గ‌ల   వేంక‌టేశ్వ‌ర వేద విజ్ఞాన పీఠంలో 28వ అఖిల‌భార‌త వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు మంగ‌ళ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. మార్చి 1వ తేదీ వ‌ర‌కు 6 రోజుల పాటు ఈ స‌ద‌స్సు జ‌రుగ‌నుంది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అద‌న‌పు ఈవో మాట్లాడుతూ వేద‌విద్య‌ను ప్ర‌చారం చేసేందుకు తిరుప‌తిలో వేద విశ్వ‌విద్యాల‌యంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో వేద పాఠ‌శాల‌ల‌ను టిటిడి నిర్వ‌హిస్తోంద‌న్నారు.

అదేవిధంగా, ప‌లు ప‌థ‌కాల ద్వారా వేద‌పారాయ‌ణ‌దారుల‌కు, వృద్ధ పండితుల‌కు ఆర్థిక‌సాయం అందిస్తున్న‌ట్టు తెలిపారు.

భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాలు గొప్ప‌వ‌ని, వేద పండితులు వాటిని భావిత‌రాల‌కు అందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అన్నారు.

వేద స‌ద‌స్సులో భాగంగా ప‌రీక్ష‌ల కోసం దేశం న‌లుమూల‌ల నుండి 727 మంది విద్యార్థులు, 104 మంది ప‌రీక్షాధికారులు విచ్చేశార‌ని, వీరంద‌రికీ చ‌క్క‌టి సౌక‌ర్యాలు క‌ల్పించామ‌ని తెలిపారు.

ఈ ప‌రీక్ష‌ల్లో ప్ర‌థ‌మ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి 5 గ్రాముల బంగారు ప‌త‌కం, ద్వితీయ శ్రేణిలో నిలిచిన వారికి 10 గ్రాముల వెండి ప‌త‌కం బ‌హుమానంగా అందిస్తామ‌ని, వీటితోపాటు న‌గ‌దు బ‌హుమ‌తి, స‌ర్టిఫికేట్‌, పండిత శాలువా ప్ర‌దానం చేస్తామ‌ని వెల్ల‌డించారు.

సుమారు రూ.2 కోట్ల వ్య‌యంతో ఈ వేద స‌ద‌స్సును టిటిడి నిర్వ‌హిస్తోంద‌ని, వేద విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్వో మనోహర్, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, క్యాటరింగ్ అధికారి జిఎల్ఎన్.శాస్త్రి, వేద పాఠశాల ఆధ్యాపకులు జిఎవి.దీక్షితులు,   పి.సీతారామాచార్యులు,   ఎన్వి.మోహనరంగాచార్యులు,   విఎన్.భట్టాచార్య ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*