
గుమ్మడి కాయలు రాతి పై పగులకొడుతూ న్నారంటే, అక్కడ శాంతి పూజలు అమ్మవార్లకు శాంతి పూజలు, చేస్తున్నారని భావించడం మాములే. కాని అదికాదు అంటున్నారు అనంతపురం కు చెందిన గోవింద భజనలు సంఘం వారు
ప్రతి ఆదివారం ఉద్యోగ, వ్యాపారసంస్థలకు సెలవుదినం కావడంతో వాళ్లంతా బజారుకు ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, పశువుల దాన,
అలసందులు, అనుములు, శనగ లు, తృణ ధాన్యములు, అపరాలు కొనుగోలు చేసి తమ వాహనాలలో ఇస్కాన్ “గోశాల “తరలిస్తారు.
అక్కడ ఉన్న దేశవాళీ ఆవులకు, “గోపూజ “జరిపి తాము కోనుగోలు చేసిన వాటిని స్వయంగా ఆవులకు ఆహారంగా అందిస్తారు.
ప్రతి శనివారం ఒక ఇంటికెళ్లి భజన చేసి, అక్కడ లభించిన హారతి పళ్లెం డబ్బులు, దక్షిణలు తో పాటు మరింత డబ్బు సంఘం సభ్యులు చెల్లించి పై వాటిని కొనుగోలు చేస్తారు.
ఒకవారం కాదు ప్రతి వారం సమయమున్న వారంతా కుటుంబసభ్యులతో వెళ్లి గోసేవ చేస్తారు.
గోలానందన గోవిందా, గోమాత పాలక గోవిందా అంటు గోవిందా నామ ఉత్సారణ ల మధ్య “గోసేవ “నిర్వహించడం ఆనవాయితీ.
Leave a Reply