దివ్యాంగులు, అనాథ భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నభాగ్యం

శ్రీ‌కాకుళం జిల్లాలోని ఓ అనాథాశ్ర‌మానికి చెందిన 17 మంది దివ్యాంగులు, అనాథ భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం ఏర్పాట్లు చేశాన‌ని వైవి.సుబ్బారెడ్డి చెప్పారు.

తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో ఆదివారం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడారు.

తాను సింహాచ‌లం దేవ‌స్థానికి ద‌ర్శ‌నానికి వెళ్లిన‌పుడు అనాథాశ్ర‌మం నిర్వాహ‌కుడైన సిద్ధార్థ క‌లిశార‌న్నారు.

స్వామివారిని ద‌ర్శించుకోవాల‌ని దివ్యాంగులు, అనాథ భ‌క్తులు ఎదురుచూస్తున్నార‌ని తెలిపార‌ని ఛైర్మ‌న్ వివ‌రించారు.

ఆ మేర‌కు శ్రీ‌కాకుళం నుండి రైలు ప్ర‌యాణ ఖ‌ర్చులు భ‌రించి తిరుమ‌ల‌కు ర‌ప్పించి స్వామివారి ద‌ర్శ‌నం చేయించామ‌ని తెలిపారు.

అదేవిధంగా, కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ ఆల‌యాల‌ను కూడా సంద‌ర్శించేందుకు ఏర్పాట్లు చేశామ‌ని వివ‌రించారు.

శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం దివ్యాంగులు, అనాథ‌లు ఎంతో సంతోషం వ్య‌క్తం చేశార‌ని, దీన్ని భ‌గ‌వంతుని సేవ‌గా భావిస్తున్నాన‌ని తెలిపారు.

టిటిడికి సంబంధించి సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చార‌మ‌వుతున్న అవాస్త‌వ‌ క‌థ‌నాన్ని టిటిడి ఛైర్మ‌న్ వైవి. సుబ్బారెడ్డి ఖండించారు.

ఈ అంశంపై టిటిడి అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నార‌ని తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టిన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

టిటిడి అధికారుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*