
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
గజాలు, వృషభాలు ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాటాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు.
స్వామి అశ్వ వాహనమెక్కి భక్తులకు దర్శనమిచ్చి కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామసంకీర్తనతో తరించాలని ప్రబోధిస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతిరాజు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస్‌నాయక్ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Leave a Reply