గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు

క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు బుధ‌వారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల  నడుమ వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

పట్టపుటేనుగుపై ఊరేగడం చక్రవర్తి లక్షణం.

శ్రీవారు విశ్వ చక్రవర్తి కనుక – ఆవిషయాన్ని గుర్తుచేస్తూ – ఏనుగుపై ఊరేగింపుగా వస్తాడు.

‘గజం’ అనేపదం  రాకపోకలుగల ప్రకృతికి సంకేతం. అంటే విశ్వానికి సంకేతం.

విశ్వానికి అధిష్ఠానమూర్తి అయిన శ్రీనివాసుడు గజాన్ని అధిష్ఠించడం – జగత్తునూ, జగన్నాయకుణ్ణీ ఒకచోట దర్శించే మహాభాగ్యానికి చిహ్నం.

స్వామి గజేంద్ర రక్షకుడు కనుక అందుకు కృతజ్ఞతగానూ, ఏనుగు స్వామికివాహనమై, స్వామివారిసేవలో ధన్యం కావడం మహాఫలం.

ప్రత్యక్షంగా ఏనుగులు ముందుంటాయి. వాహనరూపమైన ఏనుగు పల్లకీలో ఉంటుంది.

ఏవిధంగానైనా గజవాహనసేవ ప్రశస్తమైందే, శరణాగతికి గజేంద్రునిసేవ ఉదాహరణ.

భగవంతుడు ఆర్తత్రాణపరాయణుడు. భక్తితో ప్రార్థిస్తే తప్పకవచ్చి రక్షిస్తాడనే సంగతిని గజవాహనోత్సవం సూచిస్తూంది.

అన్నీవదలి తననే శరణుకోరిన – గజేంద్రుణ్ణి రక్షించినట్లే మిమ్మల్నీ రక్షిస్తానని స్వామి అభయప్రదానం – గజవాహనసేవలో వ్యక్తమవుతుంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*