మ‌హాస‌ర‌స్వ‌తి యాగానికి ఏర్పాట్లు పూర్తి

ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, విద్యా విభాగం సంయుక్తాధ్వ‌ర్యంలో ఫిబ్ర‌వ‌రి 20న తిరుప‌తిలోని గీతాజ‌యంతి మైదానంలో(ఎస్వీ హైస్కూల్ మైదానం) మ‌హాస‌ర‌స్వ‌తి యాగం నిర్వ‌హించ‌నున్నారు.

త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న వార్షిక‌ ప‌రీక్ష‌లకు హాజ‌ర‌య్యే విద్యార్థిని విద్యార్థులు విజ‌యం సాధించాల‌ని స‌ర‌స్వ‌తి అమ్మ‌వారిని ప్రార్థించేందుకు ఈ యాగం త‌ల‌పెట్టారు. ఇందుకోసం టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ యాగం నిర్వ‌హ‌ణ కోసం 6 హోమ‌గుండాల‌ను ఏర్పాటు చేశారు. 10 మంది రుత్విక్కులు స‌ర‌స్వ‌తీ యాగం నిర్వ‌హిస్తారు. విద్యార్థిని విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా త‌గిన ఏర్పాట్లు చేశారు.

గురువారం ఉద‌యం 6 గంట‌ల‌కు అనుజ్ఞ, పుణ్యాహం, ఉద‌యం 6.30 గంట‌ల‌కు స‌ర‌స్వ‌తీ దేవి ఆరాధ‌న‌, క‌ల‌శారాధ‌న‌, నివేద‌న చేప‌ట్టి మ‌హాస‌ర‌స్వ‌తీ యాగాన్ని ప్రారంభిస్తారు. ఉద‌యం 8.30 గంట‌ల‌కు పండితుల సందేశం ఉంటుంది.

ఉద‌యం 10 గంట‌ల‌కు పూర్ణాహుతి, ప్ర‌సాద విత‌ర‌ణ‌ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

టిటిడి విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌లు, ధార్మిక సంస్థ‌ల్లో 8, 9, 10 త‌ర‌గ‌తులు, ఇంట‌ర్‌, డిగ్రీ చ‌దువుతున్న విద్యార్థిని విదార్థులు ఈ యాగంలో పాల్గొన‌వ‌చ్చు.

పూర్ణాహుతి స‌మ‌యంలో ప‌ఠించేందుకు వీలుగా విద్యార్థుల‌కు స‌ర‌స్వ‌తి మంత్రం కాపీల‌ను స‌ర‌ఫ‌రా చేస్తారు. పాల్గొన్న విద్యార్థులంద‌రికీ విద్యాకంక‌ణం, పుస్త‌కం, పెన్ను అందజేస్తారు.

టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య కె.రాజ‌గోపాల‌న్‌, విద్యాశాఖాధికారి డా. ఆర్‌.ర‌మ‌ణ‌ప్ర‌సాద్ ఈ కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*