గ‌జ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి రాజ‌సం

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధ‌వారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు గ‌జ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మ‌వారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

గజాలు, వృషభాలు ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాటాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

ఆద్యంతరహితుడైన శివదేవున్ని ఐశ్వర్యసూచికమైన గజవాహనంపై దర్శించడం కోటిజన్మల తపఃఫలమ‌ని పండితుల మాట‌.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ భూప‌తిరాజు, ఎవిఎస్వో సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*