
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు కోదండరామస్వామివారి అవతారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.
మధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు స్వర్ణ రథోత్సవము వైభవంగా జరుగనుంది.
Leave a Reply