
గజేంద్ర మోక్షం అన్న వెంటనే జ్ఞాపకం వచ్చేది పోతన భాగవతం అలాంటి గజేంద్ర మోక్షం తీర్చిదిద్దిన ఆలయం ఉందా? అంటే ఉంది అన్నసమాధానం లభించదు.
కాని దేశంలో, ప్రపంచంలో ఉందా అనిప్రశ్నిస్తే లేదు అన్న సమాధానం వస్తుంది. ఉంది అంటోంది మా “ఏడుకొండలు ”
మా ఏడుకొండలు అలా పరిశీలిస్తే అనంతపురం జిల్లా పామిడి లో కన్పిస్తుంది అంటారు. పామిడి నగర పంచాయతీలోని తగ్గు దేవాలయంలో నిత్యం పూజలు అందుకుంటున్న “శ్రీ అనంత, గజ, గరుడ, లక్ష్మీనారాయణస్వామి భారీ విగ్రహం.
పీఠంలో మొసలి, దానిపై గజేంద్రుడు, లక్ష్మీ నారాయణ స్వామిని మోసుకొస్తున్న, గరుక్మాంతుడు, మరి పైభాగంలో అనంతుడు. ఇలా గజేంద్ర మోక్షాన్ని స్ఫురించే విగ్రహం రాష్ట్రము లోఎక్కడ కన్పించదు.
అత్యంత పురాతన విగ్రహం తో పాటు ఆలయం లో వేణుగోపాల స్వామి, రామానుజాచార్యులు, అతనితో పాటు 5గురు ఆళ్వార్లు, ఆంజనేయస్వామి తో పాటు నాగ దేవతలు ఈగుడి లో ప్రత్యేక మంటపాల్లో వెలిశారు.
ప్రతి ఏకాదశి రోజు ఉదయం విష్ణుసహస్ర నామ పారాయణం, భగవద్గిత పారాయణం, భజనలు చేసి స్వామి వారికి ప్రాకారోత్సవం జరుపుతారు.
రథసప్తమికి గ్రామోత్సవం, మార్గశిరమాసం లో కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇంకో విశేషం ఏమంటే ఆళ్వార్లకు కూడా ఎదురుగ ధ్వజ, దీపస్థంభం ఏర్పాటు చేశారు.
సిరికిం జెప్పడు అంటు పోతన భాగవతంలో వ్రాసారు. గజేంద్రుని ప్రాణాలను రక్షించేందుకు లక్ష్మీ దేవికి చెప్పలేదు. శంకు, చక్రాలు ధరించలేదు.
సేవకులను పిలువలేదు. వాహనమైన గరకమంతునికి చెప్పలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టు ముడి చక్క దిద్దు కోలేదు. ఆఖరికి ప్రణయ కలహం పొందిన లక్ష్మీదేవి కొంగు ముడివిప్పలేదు.
అలా వైకుంఠపురములో, నగరిలో అమూలసౌధంబులో భగవానుడు ఉన్నాడు. అంతఃపురంలో ఒకపక్కన మెడకీ సమీపంలో దాని దగ్గర అమృత సరస్సు.
దానిదగ్గరలో చంద్రకాంత శిలలు. అరుగు మీద కలవ పుష్పలూ. అప్పుడు కాపాడమని గజేంద్రుని పిలుపు. ఆమొరవిన్న వెంటనే అన్నిటిని మరిచి స్వామి రక్షించెంచుదుకు వెళ్ళే ఘట్టం ఇక్కడ ఉంది
Leave a Reply