25 నుంచి అఖిల‌భార‌త వేదశాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు

వేద ప‌రిరక్ష‌ణ కార్యక్ర‌మాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 25 నుండి మార్చి 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న 28వ అఖిల‌భార‌త శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

తిరుమ‌లలోని ధ‌ర్మ‌గిరి ఎస్వీ వేద విజ్ఞాన పీఠంలో ఈ స‌మావేశం జ‌రిగింది. విజ‌య‌వంతం చేసేందుకు అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని ధర్మా రెడ్డి సూచించారు.

అనంత‌రం సివిల్ ఇంజినీరింగ్ ప‌నులు, ఎల‌క్ట్రిక‌ల్‌, వాట‌ర్‌వ‌ర్క్స్‌, అన్న‌ప్ర‌సాదం, బ‌స‌, వైద్యం, ర‌వాణా, పారిశుద్ధ్యం, పుష్పాలంక‌ర‌ణ‌, భ‌ద్ర‌త త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌తో చ‌ర్చించారు.

ఆ త‌రువాత వేద పాఠ‌శాల‌లోని యాగ‌శాల, స‌ద‌స్సు వేదిక ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని మాట్లాడుతూ ఫిబ్ర‌వ‌రి 25న ఉద‌యం 10.30 గంట‌ల‌కు స‌ద‌స్సు ప్రారంభమ‌వుతుంద‌ని, దేశం న‌లుమూల‌ల నుండి 715 మంది విద్యార్థులు, 115 మంది అధ్యాప‌కులు పాల్గొంటార‌ని తెలిపారు.

ఫిబ్ర‌వ‌రి 26 నుండి 29వ తేదీ వ‌ర‌కు వివిధ విభాగాల్లో అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని, మార్చి 1న ముగింపు కార్య‌క్ర‌మంలో స‌ర్టిఫికెట్లు ప్ర‌దానం చేస్తామ‌ని వివ‌రించారు.

మొత్తం 54 వేద శాఖ‌లకు సంబంధించిన ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయ‌ని, వీటిలో ప్ర‌థ‌మ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి 5 గ్రాముల బంగారు డాల‌రు, ద్వితీయ శ్రేణిలో నిలిచిన వారికి 10 గ్రాముల వెండి డాల‌రు బ‌హుమానంగా అందిస్తామ‌న్నారు.

గ‌తంలో 27 సార్లు శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సులు జ‌రిగాయ‌ని వివ‌రించారు.

Akhila Bharatha Vedic science, seminor in Tirumala

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*