ఆయనకో ఆలయం… ఆయనంటే అందరికీ అంత ప్రాణం.. ఎవరీ సంత్ సేవాలాల్?

ఆయనకు ఉత్సవాలు జరపడానికి దేశవిదేశాల నుంచి జనం పరుగులు పెడతారు. ఫిబ్రవరి 15 వచ్చిందంటే అక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది. ఆయనేమైనా దేవుడా అంటే అదీ కాదు.

కానీ, ఆలయం ఉంది. దేవుళ్ళకు జరిగే అన్ని రకాల పూజలు ఆయనకు జరుగుతాయి. ఐదారు రాష్ట్రాలలోని బంజారాలు తమ గురువును పూజించడానికి అక్కడకు చేరుకుంటారు.

తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడిని మనసారా కొలిచి తనివి తీరా దర్శించుకుని అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఆయనే సంత్ సేవాలాల్ వివరాలు మీరు తెలుసుకోండి.

సామాజిక క్రాంతి వీరుడు బంజారాల్లో కాంతిని నింపి తండాలలో స్థిర నివాసం ఏర్పరుచుకొనేలా చేసిన మహోన్నత వ్యక్తి సంత్ సేవాలాల్ దేవాలయం భారత దేశంలో ఒక్కటే ఉంది.

అది ఎక్కడ? అనిప్రశ్నిస్తే గుత్తి మండలం చెర్లోపల్లి దగ్గర సేవాఘడ్.

19ఏళ్ళ క్రితం రాళ్లు, నిర్జీవమైన కొండప్రాంతం పెద్దబండరాళ్ళు, అటవీ గుట్ట, పైనచెట్లు. ప్రస్తుతం ఆదిదేశంలోనే అతి పవిత్ర స్థలం.

ఎందుకంటే అక్కడ ఆలయం, జగదాంబ ఆలయం, స్వామి వారిని దర్శించి, పూజించేవారు రావడం ఒక గొప్పవిశేషం.

ఈయన బంజారాల గురువు. 1739 ఫిబ్రవరి 15తేదీన భీమానాయక్, ధర్మిణి బాయ్‌లకు సంత్ సేవాలాల్ ఈ గ్రామం లో జన్మించాడు.

కాలక్రమంగా ఆయన పెద్దవాడై దేశ సంచారం చేస్తూ వెళ్లిన ప్రతిచోటా, తనమహిమలను చూపిస్తూ, ప్రతి ఒక్కరిని సన్మార్గం లో నడిపిన మహనీయులు సంత్ సేవాలాల్.

దేశంలో 12కోట్ల మంది బంజారాల ఆరాధ్య దేవుడు శ్రీ సంత్ సేవాలాల్. ఒకప్పుడు రంజినాయక్ తండా ఇక్కడ ఉండేది.

రంజిత్ నాయక్ అనేఒక చారిత్రిక పరిశోధకుడు అనేక ఆధారాల పరిశీలించిన అనంతరం సేవాలాల్ ఇక్కడ జన్మించారు.

ఆయనే బంజారాల వద్దా చందాలు వసూలుచేసి, బంజారాలను ఏకం చేసి, ఆలయం నిర్మించారు.

సేవాలాల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఏటా ఘనంగా సేవాలాల్ జయంతి నిర్వహిస్తున్నారు. సేవాలాల్ జగదాంబ వరంతో జన్మించారని, అందువలన ఇక్కడ జగదాంబ దేవాలయం నిర్మించారు.

అత్యంత రమణీయంగా ప్రతిఏటా సంత్ సేవాలాల్ జయంతి నిర్వహిస్తారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని బంజారా నాయకులు, రాజకీయ, ప్రభుత్వ, న్యాయ రంగాలలో స్థిరపడిన పెద్దలెందరో ఈఉత్సవాలకు బారులు తీస్తారు.

ఆలయ నిర్మాణానికి విశేష కృషి సల్పిన రంజిత్ నాయక్ శిలావిగ్రహాన్ని ఏర్పరచడం ఆనంద దాయకం.

సంచార జీవనం చేసే సుగాలీలను అద్భుత జీవన మార్గాలను భోదించి తండాలలో స్థిరనివాసమెర్పరిచి చైతన్యతను తెచ్చి ఆద్యాత్మికం వైపు మళ్లించిన మహోన్నత వ్యక్తి సంత్ సేవాలాల్.

అహింస మార్గాన్ని చూపిస్తూ, పశుపోషణ తో తనతో పాటు సంచరించే జీవనవిధానాలు భోదించే సంత్ కు చిన్నపాటి నుండే ఆధ్యాత్మిక మార్గం లో జీవనం సాగించారు. ధుమ, మద్యపానాలను వ్యతిరేకించిన మహనీయుడు.

జీవహింస ను వ్యతిరేకించారు. మహారాష్ట్ర లోని రుయఘడ్ లో 1806ఏప్రిల్ 4న తనువు చాలించారు. అక్కడే ఆయన సమాధి ఉంది.

స్వామి వారిజన్మస్థలాన్ని సేవాఘడ్ అని నామకరణం చేశారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13, 14, 15తేదీలలో స్వామి జయంతి ఉత్సవాలు గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తుంది.

అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ట్రస్ట్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది.

అనంతపురం, గుంతకల్ శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి, వై. వెంకటరామిరెడ్డి, మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి సంజీవ్ రాథోడ్, కర్ణాటక సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రభు రాథోడ్ పాల్గొన్నారు.

అయన కారణజన్ముడు అని రాజస్థాన్ శ్రీ చైతన్య గిరిజన మఠాధిపతి చేతనగురుజి ప్రారంభోత్సవ సభలో అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు జగన్నాథరావు, ఉపాధ్యక్షులు కేశవనాయక్, సభ్యులు పాల్గొని మార్గదర్శకం చేశారు.

సాంస్కృతిక, కార్యక్రమాలు బంజరాసంస్కృతి వెదజల్లేలా ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. స్వామి వారి ఇరుముడులు ధరించు భక్తులు దీక్షలు చేసి వచ్చారు. హోమాలు పూజలు చేశారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*