లైట్ మెట్రో… అంటే తిరుమలకు రైలా..?

తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఓ మార్గం సూచించారు. తేలికపాటి మెట్రో నడిపితే మంచిదని అభిప్రాయపడ్డారు.

తిరుమల తిరుపతి మధ్యన వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా తిరుమల కొండల్లో పర్యావరణం, జంతుజాలాలకు నష్టం వాటిల్లుతోంది.

దీనిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ సుబ్బారెడ్డి మెట్రో ఎండితో చర్చించారు.

శుక్రవారం మధ్యాహ్నం పద్మావతీ అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండి ఎన్వీఎస్ రెడ్డి మధ్యన చర్చలు జరిగాయి.

తిరుపతి, తిరుమలలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించారు.

తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా రవాణా మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలు, అలాగే రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు సుందరీకరణ గురించి చర్చించారు.

అందుకు లైట్ మెట్రో రైళ్ళ ఏర్పాటును ఓ పరిష్కార మార్గంగా సూచించారు.

భవిష్యత్తులో తిరుపతి, తిరుమలను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక దివ్యకేంద్రాలుగా తీర్చి దిద్దడానికి టీటీడీ అధికారులతో కలిసి పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని సుబ్బారెడ్డి సూచించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*