
తిరుపతిలో రోజు రోజుకు పెరిగిపోతున్న రద్దీ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రత్యేక తిరుమల భక్తుల కోసమే అన్నట్లుగా నిర్మిస్తున్న గరుడవారధికి నిధులు విడుదల చేయడంలో శ్రద్ధ కనబరచడం లేదు.
తిరుమల భక్తుల కోసమే… అన్నట్లుగా బీరాలు పలికే టీటీడీ అధికారులు వారికోసం నిర్మించే ఫ్లై ఓవర్ బ్రిడ్జి విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనిపై పలు సంస్థలు, శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగర ప్రజలతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం టిటిడి ఆర్థిక సహకారంతో నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ గరుడవారధి నిర్మాణాన్ని ప్రారంభించింది.
ఈ వారధి ప్రారంభించి చాలా కాలం అయ్యింది. ఇప్పటికే స్తంభాలను కొన్ని చోట్ల నిర్మించారు. కూడా. దీని వలన తిరుపతి నగరంలోకి వచ్చే ప్రధాన రహదారుల నుంచే వచ్చే వాహనాలు నేరుగా వారధి మీదుగా అలిపిరి వద్దకు చేరుకోవచ్చు.
అలాగే నగరం బయట నుంచి వెళ్ళిపోవచ్చు. ఫలితంగా భక్తులు ఎక్కడ అసౌకర్యానికి గురికాకుండా, నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. చాలా ఉపయోగకరం. అలాగే చాలా కాలంగా తిరుపతి వాసులు వేచిచూస్తున్న ప్రాజెక్టు కూడా.
అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్లాల్సిన అంబులెన్సులు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయి సకాలంలో ఆసుపత్రులకు చేరలేక వైద్యం అందక ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుుతన్నాయి.
అయితే కొద్ది నెలల కిందట గరుడవారధిని ప్రారంభించారు. ఇప్పటికే పలు చోట్ల స్తంభాల నిర్మాణం కూడా పూర్తయ్యింది. అయితే గురుడ వారధికి ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాల్సిన టీటీడీ ఇప్పటివరకు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రధానంగా ఈ వారధి ఉపయోగపడేది శ్రీవారి భక్తులకే సింహ భాగంలో నిధులను కేటాయించాల్సింది కూడా టీటీడీనే. కానీ, టీటీడీ వారధికి నిధులు ఇవ్వడంలో అలసత్వం వహిస్తోంది. ఫలితంగా వారధి నిర్మాణంపై ప్రభావం పడుతోంది.
వేగంగా నిర్మాణం జరగడం లేదు. గుజరాత్లో టిటిడి ఏసీ కల్యాణ మండప నిర్మాణం,కాశ్మీర్లో శ్రీవారి ఆలయ నిర్మాణం జరపడానికి రెక్కలు కట్టుకుని బయలుదేరుతున్న అధికారులు స్వామి పాదాల చెంత భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అలసత్వం వహిస్తున్నారని ఐఎన్టీయుసీ నాయుకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
శ్రీవాణి ట్రస్టుకు 100 రోజుల్లో 45 కోట్లు వచ్చింది అని గొప్పలు చెప్పుకునే అధికారులు వారధికి ఎందుకు నిధులు కేటాయించడం లేదనే విషయం సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెంటనే పాలకమండలి స్పందించి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Leave a Reply