
వేంకటేశ్వరస్వామిని గుర్తించెదెవరు?
తిరుమల వెంకటేశ్వర స్వామికి ప్రపంచ నలుమూలల భక్తులు ఉన్నారు. లిప్త కాలం పాటు ఆయన దర్శన భాగ్యం కలిగితే చాలు అనుకునే వారు ఎందరో? అయితే నిత్యం అక్కడే ఉంటూ స్వామిని తాకుతూ స్వామి కైంకర్యాలను నిర్వహించే అర్చకుల జీవితం ధన్యం కదా? మొట్టమొదటిగా ఆ భాగ్యం ఎవరికి కలిగింది.? స్వామికి తొలి సారిగా అర్చన చేసిందెవరు? ఆయన పేరేంటి? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ! అయితే తప్పక కథనాన్ని చదవాల్సిందే.
కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి వెలసవడంపై కథలున్నాయి. కథలు ఎన్ని ఉన్నా ఇతివృత్తం ఒకటే. శిలాగా వెలిశాడని చెబుతారు. శ్రీమహావిష్ణువే శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణంలోని ‘శ్రీ వేంకటాచల మహత్యం’ చెబుతోంది. యోగిపుంగడు, వైఖానస అర్చకుడైన శ్రీ మాన్ గోపీనాథ దీక్షితులు మొట్ట మొదటగా, స్వామిని కనుగొన్నట్లు శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి అర్థమవుతుంది. పుష్కరిణి చెంత చింత చెట్టు క్రింది చీమల పుట్టలో ఉన్న వేంకటేశ్వర స్వామి అర్చామూర్తిని ఆయన కనుగొన్నారట. అదే ప్రదేశంలో స్వామి అర్చా మూర్తి ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి.
గోపినాథ దీక్షితులే స్వామి కైంకర్యాలను, పూజలను తొలిసారిగా నిర్వహించారని తెలుస్తోంది. తరువాతి కాలంలో స్వామి కైంకర్యాలను నిర్వహించిన వారిలో యామానాచార్యులు ప్రముఖులు. యామానాచార్యుల తరువాత తిరుమలనంబి, రామానుజాచార్యులు తదితరులు ఉన్నారు. నేడు నాలుగు కుటుంబాల వారు అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నాలుగు కుటుంబాలే తరతరాలుగా కైంకర్యాలను నిర్వహిస్తున్నట్లు ప్రస్తుతం ఉన్న రికార్డుల ద్వారా తెలుస్తోంది. పదకవితాపితామహుడు అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబలు కూడా తిరుమల క్షేత్రంలో పేరుమోసి స్వామిని పూజించిన వారు.

ప్రస్తుతం ఉన్న వారిలో ప్రముఖులు రమణధీక్షితులు, నరసింహదీక్షుతులు వీరితోపాటు మరో ఇద్దరు ప్రధానార్చకులుగా ఉండేవారు. అయితే కిందటి యేడాది రిటైర్మెంట్ ప్రకటించి రమణధీక్షితులతోపాటు కొందరిని టీటీడీ అర్చకత్వం నుంచి తప్పించింది. తాజాగా5.11.2019 ఆయనకు ఆగమ సలహాదారుల మండలిలో సభ్యత్వం కల్పిస్తూ, ప్రస్తుతం ఉన్న అర్చకులకు మార్గదర్శిగా ఉండే బాధ్యతలను ప్రభుత్వ రమణ ధీక్షితులకు అప్పగించింది. ఎవరు అర్చకులుగా ఉన్నా, ప్రధానార్చకులుగా ఉన్నా కైంకర్యాలు మాత్రం పూర్వీకులు నిర్ణయించిన ప్రకారమే నేటికీ సాగుతున్నాయి.
Leave a Reply