పుట్టిన తేది ప్రకారం జీవితాన్ని మార్చుకోవచ్చా…? అదేలా తెలుసుకోవాలని ఉందా?

సాధారణంగా జన్మ నక్షత్రాన్ని చూసి కష్టం-నష్టం, సుఖం-దుఖం చెబుతారు. లాభనష్టాలను, జాతక ఫలితాలను బేరీజు వేస్తారు.

సాధారణంగా కొన్ని వస్తువులను ఏర్పాటు చేసుకోవడం వలన శుభం జరుగుతుందని చెబుతారు. అయితే ఇంట్లో కేవలం కొన్ని వస్తువులను అర్చుకోవడం వలన జీవితాన్ని మార్చుకోవచ్చని ఎంతమందికి తెలుసు.

శాస్త్రాలను అనుసరించి నెలలో ఒకటో తేదిన జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ఫ్లూట్‌ను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలట.

2న జన్మించిన వారు తెలుపు రంగు గవ్వలతో చేసిన బొమ్మలను వాయవ్య దిశలో ఉంచాలి. ఈ గవ్వలు ఎప్పుడూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయట.

ఇక 3, పుట్టిన వ్యక్తులైతే రుద్రాక్షను ఇంట్లోని ఈశాన్య దిక్కులో పెట్టాలి, కానీ, రుద్రాక్ష మాలలో ఉపయోగించరాదట. 4న జన్మించిన వారు అద్దాలను ధీర్ఘచతురస్రాకారంలో చిన్న ముక్కులుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి.

ఇక్కడ ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. వాటిరి చెల్లాచెదురుగా ఏర్పాటు చేయరాదు. అది కీడుకు సంకేతం. అందుకే పగిలిన అడ్డదిడ్డం ఉన్న అద్దాలను ఇంట్లో ఉంచుకోరు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి.

5న జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచితే సంపదలు, శ్రేయస్సు లభిస్తుందిట.

6న జన్మించిన వాళ్లు నెమలి పింఛాన్ని ఇంట్లోని ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద విస్తారంగా వృద్ధి చెందుతుంది. 7న పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశగా రుద్రాక్షను ఉంచాలి. ఇది ముదురు రంగులో ఉండాలి.

8న జన్మించిన వారు తమ ఇంటిలోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ ను ఉంచితే, అది ప్రతికూల శక్తిని గ్రహించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

తొమ్మిది పుట్టిన వారు పిరమిడ్‌ను ఇంట్లోని దక్షిణంగా ఉంచితే దుశ్శకునాలు తొలిగిపోతాయట.

ఇక మీద రాబోయే తెదీలు వాటి అంకెలను కూడగా వచ్చే సంఖ్యలు ఏ తేదికీ సరిపోతాయో వాటి ఫలితాలు వర్తిస్తాయన్నమాట. ఉదాహరణకు 11వ తేదీ జ‌న్మిస్తే మీ జ‌న‌న సంఖ్య 2 అవుతుంది.

21 తేదిన జన్మిస్తే మీ జనన సంఖ్య 3 అవుతుంది. ఆ తేదీల ఫలితాలు వారికి వర్తిస్తాయి. మిగిలిన అన్ని తేదీలను ఇలా లెక్కించుకోవచ్చట.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*