చెట్టులో “ॐ” ఆకారం… యాధృశ్చికమా…? మహిమా..? మీరూ తిలకిస్తారా?

వేపచెట్టుకు పాలు కారాయి. బొప్పాయిలో వినాయకుడు ఇలాంటి చాలా కథనాలను విన్నాం. చూశాం. ఇందులో కొంత జన్యు పరమైన లోపాల కారణంగా ఉండవచ్చు అనే వాదనలు విన్నాం.

ఓ చెట్టు కాండంలో “ॐ” ఆకారం ఎప్పుడైనా విన్నారా? చూశారా.? ఇది తెలుసుకోవాలంటే మనం కేరళకు వెళ్ళాల్సిందే. అక్కడ జరిగిన ఆ ఘటన జనం తండోపతండాలుగా వెళ్ళి మొక్కుతున్నారా? ఇంతకీ అక్కడ ఏం జరిగింది?

కేరళ వాసులు అడిగితే అద్భుతం..జరిగిందంటారు. అది అద్భుతమో… యాధృశ్చికమో.. జన్యులోపమో తెలియదు కానీ, అక్కడ చాలా స్పష్టంగా “ॐ” ఆకారం కనిపిస్తుంది. ఇక విషయంలోకి వస్తే,

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కిలక్కంబలం శ్రీ కృష్ణస్వామి ఆలయం వద్ద పాత మర్రి చెట్టు ఉండేది. ఈ మధ్య వచ్చిన గాలి వానకు ఆ చెట్టులోని ఒక భాగం పడిపోయింది.

ఇక్క అక్కడున్న ఓ రైతు దానిని కత్తిరించాడు. కత్తించిన తరువాత ఒచ్చిన ఆకారాన్ని చూసి ఆశ్చర్యం పోవడం వారి వంతయ్యింది. అందులో “ॐ” ఆకారం కనిపించింది.

ఇందులో మాయే ఉందో… మర్మమే ఉందో… మహిమో.. అద్భుతమో తెలియదు గానీ, అచ్చువేసినట్లు “ॐ” ఆకారం కనిపించడం విశేషం.

ఇంకేముందు వందలాది మంది దీనిని చూడటానికి తరలి వచ్చారు. ఆ ఆకారాన్ని అక్కడ పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. వాటిని మీరు తిలకించండి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*