జనవరి 26 నుండి దేవుని కడపలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 26 నుండి జరునున్నాయి.

ఫిబ్రవరి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతాయి.

జనవరి 25వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                 ఉదయం              రాత్రి

26-01-2020(ఆదివారం)     ధ్వజారోహణం           చంద్రప్రభ వాహనం

27-01-2020(సోమవారం)      సూర్యప్రభవాహనం      పెద్దశేష వాహనం

28-01-2020(మంగళవారం)   చిన్నశేష వాహనం     సింహ వాహనం

29-01-2020(బుధవారం)        కల్పవృక్ష వాహనం       హనుమంత వాహనం

30-01-2020(గురువారం)   ముత్యపుపందిరి వాహనం గరుడ వాహనం

31-01-2020(శుక్రవారం)          కల్యాణోత్సవం          గజవాహనం

01-02-2020(శనివారం)            రథోత్సవం       ధూళి ఉత్సవం

02-02-2020(ఆదివారం)       సర్వభూపాల వాహనం     అశ్వ వాహనం

03-02-2020(సోమ‌వారం)     వసంతోత్సవం, చక్రస్నానం     హంసవాహనం, ధ్వజావరోహణం

కాగా జ‌న‌వ‌రి 31వ తేదీ శుక్ర‌వారం ఆలయంలో కల్యాణోత్సవం ఉదయం 9.30 నుండి 1130 గంటల వరకు వైభవంగా జరుగనుంది.

రూ.300- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.

ఫిబ్రవరి 4వ తేదీ మంగ‌ళ‌వారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*