
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 25వ తేదీన బుధవారం రాత్రి 11.00 గంటలకు టిటిడి అనుబంధ ఆలయాలను మూసి వేయనున్నారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామస్వామివారి ఆలయం,
శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను సూర్యగ్రహణ ఉపశమన చర్యలను తీసుకుంటారు.
గురువారం ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఆలయశుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం రాత్రి 9.00 గంటల నుంచి డిసెంబరు 26వ తేదీ గురువారం మధ్యాహ్నం 12.00 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం తలుపులు మూసివేస్తారు.
ఆనంతరం మధ్యాహ్నం 3.15 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రాత్రి 9.00 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12.000 గంటల వరకు ఆలయం తలుపులు మూసివేస్తారు.
ఆనంతరం మధ్యాహ్నం 2.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో
తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో రాత్రి 9.00 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12.000 గంటల వరకు ఆలయం తలుపులు మూసివేస్తారు. ఆనంతరం మధ్యాహ్నం 2.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
శ్రీనివాసమంగాపురం ఆలయంలో
శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రాత్రి 8.30 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12.000 గంటల వరకు ఆలయం తలుపులు మూసివేస్తారు.
ఆనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
అప్పలాయగుంట ఆలయంలో
అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రాత్రి 8.00 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఆలయం తలుపులు మూసివేస్తారు.
ఆనంతరం మధ్యాహ్నం 2.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
Leave a Reply