తిరుచానూరు కార్తిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాటితో ముగిశాయి. బ్రహ్మోత్సవాల అనంతరం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా డిసెంబరు 2వ తేదీ సోమవారం ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు.
సోమవారం సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు ఈ కార్యక్రమం వైభవంగా జరుగనుంది. పుష్పయాగంలో భాగంగా రకరకాల పుష్పాలను వినియోగించనున్నారు.
ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేసింది. రూ.500/- టికెట్ కొనుగోలు చేసి గృహస్తులు(ఇద్దరు) పుష్పయాగంలో పాల్గొనవచ్చు.
Leave a Reply