వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరిగేది కాదా?

సకల సౌకర్యాలు ఉన్న వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడమే కష్టం అయ్యిందా? ఇలాంటి సమయంలో అప్పట్లో ఏం చేశారు? ఎలాంటి ఏర్పాటు చేశారు? తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.

తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్ర  తెలుసుకుంటూ ఉంటే తరిగి పోయేదేం కాదు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన వెంకన్న ఆలయంలో ఎన్నో వింతలు జరిగాయి. కాలానుగుణంగా మార్పులు కూడా జరుగుతూ వచ్చాయి.

వెంకటేశ్వరస్వామి అర్చనకు నేటికి ఆకాశ గంగ నుంచి నీటిని తీసుకువస్తారు. ఒకప్పుడైతే పాపనాశనం నుంచి తీసుకు వచ్చేవారు.

8 అడుగుల పైగా ఎత్తు కలిగిన విగ్రహానికి అభిషేకం చేయడం అంటే మాటలు కాదు సకాలంలో అన్నీ కావాలి. అందునా అడవులు అడవుల్లో పాలు, పెరుగు, నెయ్యి, నీళ్లు సేకరించడం అనేది అప్పట్లో సాధ్యం అయ్యేది కాదేమో?

అప్పట్లోనే ఇందుకు కొన్ని ప్రత్యామ్నాయాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు లో భాగమే భోగ శ్రీనివాసుడు ప్రతిష్ట. చరిత్ర చెబుతున్న వివరాల ప్రకారం పల్లవ యువరాణి సమవాయి ఈ భోగ శ్రీనివాస విగ్రహాన్ని తయారు చేయించి అక్కడ ఏర్పాటు చేశారు.

ఈ చిన్న విగ్రహాన్ని  అర్చన మూర్తికి అనుసంధానించి  ప్రతిరోజు భోగ శ్రీనివాసుడికి అభిషేకం చేసే వారు. అభిషేకం కోసం వెలసిన వాడే భోగ శ్రీనివాసుడిని చెబుతుంటారు. ఈ చరిత్ర ఆధారంగా చూసినప్పుడు వెంకటేశ్వర స్వామికి నిత్యం అభిషేకం ఉండేది కాదని అర్థం అవుతోంది.

నేడు సౌకర్యాలు పెరిగాయి. అడవిలోనే పట్టణం వచ్చింది. అర్చా మూర్తికి నిత్యం అభిషేకం సాగుతోంది. అలాగే భోగ శ్రీనివాసుడు కూడా అవే సేవలు అందుకుంటున్నాడు

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*