
తమ ఖజానా విభాగంలో ఉన్న విదేశీ నాణేల తరలింపునకు అర్హత గల బ్యాంకులు, అధీకృత ఫారిన్ ఎక్సేంజి డీలర్ల నుండి సీల్డ్ టెండర్లు ఆహ్వానించడమైనదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర టిటిడి ఆలయాల్లో భక్తులు హుండీ ద్వారా సమర్పించిన విదేశీ నాణేలను ఖజానా విభాగంలో భద్రపరిచారు. ఇందులో మలేసియా, యుఎస్ఏ, యుకె, యూరో, యుఏఇ, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, శ్రీలంక, కువైట్, బహ్రెయిన్, థాయిలాండ్, నేపాల్, మాల్దీవులు, న్యూజిలాండ్, హాంగ్కాంగ్, ఖతార్, ఓమన్ తదితర దేశాల నాణేలున్నాయి.
నవంబరు 28న తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల డిప్యూటీ ఈవో(ట్రెజరీ మరియు ఇన్వెంటరీ) కార్యాలయంలో సీల్డ్ టెండర్లు తెరుస్తారు. ఇతర వివరాలకు టిటిడి వెబ్సైట్ www.tirumala.org ను సంప్రదించగలరు
Leave a Reply