లైట్ మెట్రో… అంటే తిరుమలకు రైలా..?

తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఓ మార్గం సూచించారు. తేలికపాటి మెట్రో నడిపితే మంచిదని అభిప్రాయపడ్డారు. తిరుమల తిరుపతి మధ్యన వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా తిరుమల కొండల్లో పర్యావరణం, జంతుజాలాలకు నష్టం వాటిల్లుతోంది.