ఫిబ్రవరి 2వ తేదీ నుండి గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 2 నుండి 8వ తేదీ  వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి.

ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా భోగితేరు

తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం సంక్రాంతి భోగి పండుగను ఘనంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉద‌యం తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ధ‌నుర్మాస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ త‌రువాత స‌హ‌స్ర‌నామార్చ‌న చేప‌ట్టారు.

తిరుపతిలో ఘనంగా ముగిసిన ఆండాళ్‌ నీరాటోత్సవాలు

తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారి నీరాటోత్సవాలు సోమ‌వారం ఘనంగా ముగిశాయి. జనవరి 7 నుండి ఆండాళ్‌ అమ్మవారికి నీరాటోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు ఆండాళ్‌ అమ్మవారు బంగారు తిరుచ్చిపై గోవిందరాజస్వామివారి ఆలయం నుండి రామచంద్ర తీర్థ క‌ట్ట‌కు ఊరేగింపుగా చేరుకున్నారు.

No Image

జనవరి 14న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో భోగి తేరు

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14వ తేదీన మంగ‌ళ‌వారం భోగి పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సంద‌ర్భంగా సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.