గరుడ వారధి కంటే ఉత్తరాధి ఆలయాలే ముఖ్యమా..? ఇదేనా టీటీడీ వహించే శ్రద్ధ

తిరుపతిలో రోజు రోజుకు పెరిగిపోతున్న రద్దీ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రత్యేక తిరుమల భక్తుల కోసమే అన్నట్లుగా నిర్మిస్తున్న గరుడవారధికి నిధులు విడుదల చేయడంలో శ్రద్ధ కనబరచడం లేదు.

తిరుమల భక్తుల కోసమే… అన్నట్లుగా బీరాలు పలికే టీటీడీ అధికారులు వారికోసం నిర్మించే ఫ్లై ఓవర్ బ్రిడ్జి విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనిపై పలు సంస్థలు, శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.