నేడు తిరుచానూరులో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం రాత్రి అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆలయంలో అమ్మవారికి, విష్వక్సేనులకు విశేష పూజలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణాబాధ్యత విష్వక్సేనుల వారిదే కనుక ఆయనకు కూడా పూజలు జరుగుతాయి.