
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిజె రంజన్ గొగోయ్
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
దేశ అత్యున్న న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తిరుమల స్వామివారిలో ఓ సామాన్య భక్తుడిగా మారిపోయాడు. స్వామివారి వాహనసేవలో పాల్గొని… బయటకు వచ్చిన తరువాత ఏనుగుతో ఆశీర్వాదం తీసుకుని వేంకటేశ్వరునిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. శనివారం సాయంత్రం తిరుమల చేరుకున్న గగోయ్ తిరుమలలో జరిగిన వివిధసేవలలో పాల్గొన్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. రామ మందిరం పై తీర్పు వెలువడిన తర్వాత ఈ నెలలో ఆయన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.
Copyright © 2021 | WordPress Theme by MH Themes