No Image

చిన్నశేష వాహనంపై ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజు శనివారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు వెన్నకృష్ణుడి అలంకారంలో చిన్న‌శేష‌వాహ‌నంపై భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.