
శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా కార్తీక దీపోత్సవం
తిరుమల శ్రీవారి అలయంలో బుధవారం సాయంత్రం కార్తీక పర్వదీపోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక పౌర్ణమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నులపండుగగా నిర్వహించారు.