గుడికి ఎందుకు వెళ్ళాలి? గుడిలో నిజంగా అద్భుతాలు ఉంటాయా ?

హిందువులుగా ఉన్న వారిలో చాలా మందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. దానిని మనకు మన పెద్దలు నేర్పితే, మనం మన పిల్లలకు నేర్పుతాం. ఇందులోని మర్మమేటో తెలియకుండా మనం పెద్దలు చెప్పిన ప్రకారం గుడికి వెళ్ళి పూజలు చేస్తుంటాం.