ముక్తికి ఏది మార్గం..? సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ ఏమన్నారు

అన్ని జన్మల్లో మానవజన్మ ఉత్కృష్టమైందని, భగవన్నామస్మరణ మాత్రమే ముక్తికి మార్గమని ఉడిపిలోని పుత్తిగే మ‌ఠంకు చెందిన  సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు.

వెంకన్న పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

No Image

తిరుపతిలో గోవిందుని భజనలే భజనలు

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు  పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు గురువారం తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.

తిరుపతిలో ఘనంగా ముగిసిన ఆండాళ్‌ నీరాటోత్సవాలు

తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారి నీరాటోత్సవాలు సోమ‌వారం ఘనంగా ముగిశాయి. జనవరి 7 నుండి ఆండాళ్‌ అమ్మవారికి నీరాటోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు ఆండాళ్‌ అమ్మవారు బంగారు తిరుచ్చిపై గోవిందరాజస్వామివారి ఆలయం నుండి రామచంద్ర తీర్థ క‌ట్ట‌కు ఊరేగింపుగా చేరుకున్నారు.

తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

No Image

జనవరి 16న శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో ‘గో మహోత్సవం’

తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీన గో మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మకర సంక్రాంతి పర్వదినం అనంత‌రం కనుమ సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.