మార్చి 13 నుండి విశాఖ‌ప‌ట్నం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 13 నుండి 31వ తేదీ వరకు విశాఖ‌ప‌ట్నం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం

వైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన అనంతళ్వారు 966వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్‌ తోటలో (పురశైవారితోట) ఆదివారంనాడు టిటిడి అత్యంత ఘనంగా నిర్వహించింది.

రేపటి నుంచి ”అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం’

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఫిబ్ర‌వ‌రి 24, 25వ తేదీల్లో అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 25న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

భూత వాహనంపై కామాక్షి సమేత సోమస్కందమూర్తి

తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం ఉదయం కపిలేశ్వర స్వామి వారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కంద మూర్తిగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

చంద్ర‌ప్ర‌భ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు క‌నువిందు

తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్ర‌ప్ర‌భ వాహనంపై కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి క‌టాక్షం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ‌నివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను క‌టాక్షించారు.

శ్రీనివాసమంగాపురంలోని వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుండి 22వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ.

ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఫిబ్రవరి 14 నుండి 23వ తేదీ వరకు కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుంచి 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.