
కోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా ఆలయంలోని ముఖమండపంలో ఉదయం 9 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు.