హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో ఆత్మార్పణ దినోత్సవం

అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా సాగింది.

ఆర్యవైశ్య సంఘం, వాసవి మాతృ మండలి, వినాయక చవితి కమిటీల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించాయి.

No Image

కడపలో వెంకన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ- నేడు ధ్వజారోహణం/Bramhotsavams in Kadapa, Today Dwajarohanam

కడపలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.

శ‌నివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అర్చన, తోమల సేవలు నిర్వహించారు.

పామిడిలో షట్ తిల ఏకాదశి ఉత్సవాలు

పామిడి నగర పంచాయతీ లోని తగ్గు దేవాలయం లో వెలసిన శ్రీ అనంత గజ గరుడ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో షట్ తిల ఏకాదశి వేడుకలు విభవాన్గ జరిగాయి.

స్వామివారికి ప్రాతః కాలం అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు విష్ణు సహస్ర నామపారాయణం చేశారు. భగవద్గిత పారాయణం చేశారు.

ఫిబ్రవరి 2వ తేదీ నుండి గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 2 నుండి 8వ తేదీ  వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి.

ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

కడపలో వెంకన్న బ్రహ్మోత్సవాలు..10 రోజుల్లో చూసి తరించండి

టిటిడికి అనుబంధంగా ఉన్న వై.య‌స్‌.ఆర్‌.క‌డ‌ప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ శుక్ర‌వారం సాయంత్రం ఆవిష్క‌రించారు.

No Image

మూలస్థాన ఎల్లమ్మ కు టిటిడి తరఫున సారే సమర్పించిన చెవిరెడ్డి

చంద్ర‌గిరిలోని మూల‌స్థాన ఎల్ల‌మ్మ‌కు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం టిటిడి తరఫున టిటిడి బోర్డు ఎక్స్ ఆఫిషియో స‌భ్యులు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి సారె సమర్పించారు.

No Image

ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి తిరుప‌తి జెఈవో పి.బసంత్‌కుమార్ శుక్ర‌వారం ఆవిష్క‌రించారు.

No Image

జనవరి 14న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో భోగి తేరు

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14వ తేదీన మంగ‌ళ‌వారం భోగి పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సంద‌ర్భంగా సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.