No Image

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుచానూరు

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు ముస్తాబవుతోంది. రంగు రంగుల ముగ్గులను వేసి తిరువీధులను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను తిరుమల తరహాలో చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధం చేస్తోంది.

శ్రీవారి లక్మీకాసుల హారం పద్మావతీ అమ్మవారికి..

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా న‌వంబ‌రు 27వ తేదీ తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం  ఊరేగింపు  జరుగనుంది.  శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారం ఉద‌యం 8.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల‌లోని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగించ‌నున్నారు. 

No Image

శ్రీవారి ఆలయం నుంచి పద్మావతి అమ్మవారికి సారె 

తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన డిసెంబ‌రు 1న‌ పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సమర్పించ‌డం జ‌రుగుతుంది. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

23నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి తిరుచానూరులో జరగనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కూడా పూర్తి చేశారు.

No Image

తిరుచానూరులో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఘనంగా జ‌రిగింది.