
హనుమంత వాహనంపై భద్రాద్రి రాముని అలంకారంలో పద్మావతి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం రాత్రి భద్రాద్రి రాముని అలంకారంలో అమ్మవారు కోదండాన్ని ధరించి భక్తులను కటాక్షించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం రాత్రి భద్రాద్రి రాముని అలంకారంలో అమ్మవారు కోదండాన్ని ధరించి భక్తులను కటాక్షించారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు రాజగోపాలస్వామివారి అలంకారంలో చర్నాకోలు, దండం దరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.
తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో భాగంగా పద్మావతీ అమ్మవారు మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్నారు. ఆ వీడియో మీ కోసం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి సరస్వతి అలంకారంలో అమ్మవారు వీణ ధరించి భక్తులకు అభయమిచ్చారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పెద్దశేష వాహనసేవలో చండ మేళం, గెరిగ నృత్యం, భరతనాట్యం, కోలాటం తదితర కళాప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారం అమ్మవారికి నిర్వహించిన స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) శోభాయమానంగా జరిగింది.
తిరుచానూరు పద్మావతీ అమ్మవారు ఆదివారం ఉదయం పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతున్నారు. భక్తులు కోలాహలంగా తన్మయత్వంతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారు పెదశేషవాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజు శనివారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు వెన్నకృష్ణుడి అలంకారంలో చిన్నశేషవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
తిరుమల వేంకటేశ్వరస్వామివారి పట్టపుదేవేరి అయిన తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండుగగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 8.50 గంటలకు వృశ్చిక లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. కంకణభట్టార్ వేంపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
Copyright © 2021 | WordPress Theme by MH Themes