శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్, ఈవో

శ్రీ కాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చిన చైర్మన్, ఈవో కు శాసన సభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఈవో శ్రీ పెద్దిరాజు ఆలయ సంప్రదాయాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు.

వస్త్రాల సమర్పణల అనంతరం చైర్మన్, ఈవో వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ దక్షిణాది మూర్తి దర్శనం తరువాత ఎమ్మెల్యే, ఈవో వీరికి స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందించారు. టీటీడీ అందించిన పట్టు వస్త్రాలను శనివారం రాత్రి జరిగే కళ్యాణంలో శివ, పార్వతులకు అలంకరిస్తారు.

  • సుదర్శన కౌంటర్ పునరుద్ధరిస్తాం
  • ఇది నా పూర్వజన్మ సుకృతం

వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. కొవిడ్ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాక శ్రీకాళహస్తిలో సుదర్శన్ కౌంటర్ పునరుద్ధరించి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఇచ్చేఏర్పాటు చేస్తామన్నారు.

శ్రీ కాళహస్తీశ్వరుడికి టీటీడీ గత 20 సంవత్సరాలుగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పూర్వజన్మ సుకృతం వల్ల తనకు కూడా ఈ భాగ్యం దక్కిందని చెప్పారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*