
సర్వ దర్శనంలో శ్రీవారిని దర్శించుకోవడం వారికి జూన్ 11వ తేదీ మంచి అవకాశం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
భక్తులకు జూన్ 10వ తేదీనే తిరుపతిలోని మూడు ప్రాంతాలలో గల 18 కౌంటర్లలలో ప్రతి రోజు 3 వేల ఉచిత దర్శన టోకెన్లు మంజూరు చేయనున్నారు.
ఇందులో భాగంగా తిరుపతిలోని విష్టునివాసం(8 కౌంటర్లు), శ్రీనివాసం(6 కౌంటర్లు), అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్(4 కౌంటర్లు)లలో బుధవారం ఉదయం 9 గంటల నుండి నిర్ణీత సమయ విధానంలో దర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు.
భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఒక్కరోజు ముందుగా తిరుపతిలో దర్శనం టోకెన్లు పొందాల్సి ఉంటుంది.
భక్తులు తమకు కేటాయించిన సమయంలో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది.
Leave a Reply