
పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య తన రచనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారని టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు.
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో నాదనీరాజనం వేదికపై “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణంలో శుక్రవారం ఉదయం ఆయన పాల్గొన్నారు.
అన్నమయ్య 612వ జయంతి సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవారిపై ఉన్న అచంచల భక్తితో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారని తెలిపారు.
శ్రీమహావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కొ అవతారంలో దుష్ట శిక్షణ – శిష్ట రక్షణను చేపట్టిన విధానాన్ని, దశావతారాల ప్రాశస్త్యాన్ని అదనపు ఈవో వివరించారు.
అనంతరం కరోనా వ్యాధి వ్యాప్తి అరికట్టాలని స్వామివారిని కోరుకుంటూ గత ఏప్రిల్ 10వ తేదీ నుండి ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ వేదమంత్రాలను పఠించి వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చని అన్నారు.
ఈ మంత్రంతోపాటు మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీ ధన్వంతరి స్వామిని ప్రార్థిస్తూ శ్రీ ధన్వంతరి మహామంత్రం, మాంగళ్య వృద్ధిని కోరుతూ లక్ష్మీ దేవి మంత్ర పారాయణం, నవగ్రహ ప్రార్థన చేశారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు బాలాజి, దామోదరం, వెంకటయ్య, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్ఆర్.రెడ్డి, మీడియా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply