సిఎం స‌హాయ‌నిధికి టిటిడి పెన్ష‌న‌ర్ల రూ.44.21 ల‌క్ష‌లు విరాళం

కరోనా విపత్తు సమయంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టిటిడి పెన్ష‌న‌ర్ల వెల్ఫేర్ అసోసియేష‌న్ రూ.44,21,950 విరాళాన్ని గురువారం ముఖ్య‌మంత్రి సహాయ‌నిధికి అంద‌జేసింది.

అసోసియేష‌న్ అధ్య‌క్షులు శ్రీ జి.గోవింద‌రెడ్డి తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డికి ఈ విరాళం చెక్కును అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, అసోసియేషన్ సభ్యులు శ్రీ ఆర్.ప్రభాకర్ రెడ్డి, శ్రీ ఏకాంబర్ రెడ్డి, శ్రీ దాసు, శ్రీ శ్రీనివాసులు, శ్రీ సుబ్రహ్మణ్య యాదవ్, శ్రీ చెంగల్రాజు, శ్రీ చెంగారెడ్డి, శ్రీ మునిరాజు తదితరులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*